స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

పిట్లం,వెలుగు: స్కూల్స్​, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం పెద్దకొడప్​గల్​ ఎంపీపీ ప్రతాప్​రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్కూల్స్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు సభ్యులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే స్పందిస్తూ స్కూల్స్​  ఎప్పటి కప్పుడూ తనిఖీ చేయాలని  ఎంఈవో దేవిసింగ్​ను ఆదేశించారు. అలాగే మండలంలో వ్యవసాయ వివరాలను ఏవోను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అనంతరం ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, తహసీల్దార్​ దశరథ్​, ఎంపీవో సూర్యకాంత్​, సొసైటీ చైర్మన్​ హన్మంత్​రెడ్డి, కో అప్షన్​ మెంబర్​ జాఫర్​ పాల్గొన్నారు