ఎలక్షన్‌‌ డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి

ఎలక్షన్‌‌ డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :  అక్టోబర్‌‌ 1 నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారంతా ఓటరుగా నమోదై ఉండాలని ములుగు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఓటరు నమోదు స్పెషల్‌‌ క్యాంపెయిన్‌‌లో భాగంగా శనివారం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట సర్కార్‌‌ స్కూల్‌‌లోని 9, 10, 11 పోలింగ్‌‌ సెంటర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ అర్హులైన వారంతా ఓటు హక్కు పొందేలా ఆఫీసర్లు అవగాహన కల్పించాలని సూచించారు. 

లిస్ట్‌‌లో చనిపోయిన వారి పేర్లు ఉంటే ఫామ్‌‌ 7లో నమోదు చేయాలని చెప్పారు. ఒకే ఇంటి నెంబర్‌‌పై ఎక్కువ మంది ఓటర్లు ఉంటే ఆఫీసర్లు స్వయంగా వెళ్లి పరిశీలించాలని, ఫొటో కరెక్షన్, డబుల్‌‌ ఎంట్రీ, ఇతర పొరపాట్లు లేకుండా సరిచేయాలని ఆదేశించారు. లిస్ట్‌‌లో మార్పులు, చేర్పులకు మరో చాన్స్‌‌ లేనందున అర్హులైన ప్రతి ఓటరు వివరాలు పక్కాగా ఉండేలా చూడాలన్నారు. 

అనంతరం బీఎల్‌‌వో కిట్‌‌లను పరిశీలించి పోలింగ్‌‌ బూత్‌‌లో లిస్ట్‌‌ను అతికించాలని సూచించారు. ఎలక్షన్‌‌ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వెంకటాపూర్ తాహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లో ఓటర్‌‌ లిస్ట్‌‌ను పరిశీలించారు. కార్యక్రమంలో వెంకటాపూర్ తహసీల్దార్‌‌ ఖాజా మోహినొద్దీన్‌‌, డీటీ కిశోర్‌‌ పాల్గొన్నారు.

అప్లికేషన్లను వెంటవెంటనే ఆన్‌‌లైన్‌‌ చేయాలి

మహబూబాబాద్/కురవి, వెలుగు : ఓటు నమోదు కోసం వచ్చిన అప్లికేషన్లను వెంట వెంటనే యాప్‌‌లో నమోదు చేయాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్‌‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్‌‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారు, దివ్యాంగులు, మృతుల ఓటర్లు, 80 సంవత్సరాలు దాటిన వారిపై స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టాలని చెప్పారు. 

ఇంటింటి సర్వే చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మహబూబాబాద్‌‌ తహసీల్దార్‌‌ ఇమ్మానియేల్‌‌ ఉన్నారు. అలాగే కురవిలోని జడ్పీహెచ్‌‌ఎస్‌‌ స్కూల్‌‌లో ఏర్పాటు చేసిన ఓటర్ లిస్ట్‌‌ను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌‌ సునీల్‌‌, డీటీ రఫి ఉన్నారు.