తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు : డీఎస్పీ చంద్రభాను

గుండాల, వెలుగు :  సోషల్ మీడియాలో ఇతర పార్టీల గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు.  మంగళవారం మండల పరిధిలోని నర్సాపురం, నర్సాపురం తండాలో ఓటర్లకు సోషల్ మీడియాపై అవగాహన కల్పించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని  సూచించారు. అనంతరం చెక్​పోస్టులను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్, ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.