ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వేములవాడ, వెలుగు : అభివృద్ధి పనుల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల కలెక్టర్​ అనురాగ్ జయంతి హెచ్చరించారు. శనివారం వేములవాడలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను, భగవంత్ నగర్ జడ్పీ హై స్కూల్​ను సందర్శించారు. మన ఊరు మనబడి కింద చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఎంపిక చేసిన 15 స్కూళ్లలో చేపట్టిన పనుల స్టేటస్ రిపోర్ట్ ను అందించాలన్నారు. --వచ్చే నవంబర్ లోగా పట్టణంలోని శ్యామకుంట వెజ్, నాన్-వెజ్ మార్కెట్ ను పూర్తిచేయాలన్నారు. అలాగే చెక్కపల్లి నుంచి కోరుట్ల జంక్షన్ వరకు 4 వరుసల రోడ్డుకు, వట్టెంల రోడ్డుకు టెండర్ లు పిలవాలని ఆర్ డ్ బీ ఇంజనీర్ లకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ లు పవన్ కుమార్, శ్రీనివాస్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్​ మాధవి తదితరులు ఉన్నారు. 

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

గంగాధర, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లోనే రైతు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని, రైతులు తమ పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి, బూరుగుపల్లి, లక్ష్మీదేవిపల్లి, గంగాధరలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం చర్లపల్లి(ఎన్​) గ్రామానికి చెందిన ఓదవ్వకు రూ.లక్ష ఎల్​ఓసీ అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజగోపాల్​రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్​ దూలం బాలాగౌడ్​తదితరులు పాల్గొన్నారు. 

ఇల్లందకుంట: మండలంలోని మల్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జడ్పీ చైర్​పర్స కనుమల్ల విజయ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి బాసటగా నిలవాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించొద్దని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్​మాధవి, వైస్ ఎంపీపీ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్​లో 5కే రన్

కరీంనగర్ సిటీ, వెలుగు: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలో శనివారం మెగా 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వివిధ సంస్థల ప్రతినిధులు, పోలీసు శిక్షణ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. మార్క్ ఫెడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన రన్​ పట్టణంలోని రాంనగర్, మంకమ్మ తోట, గీత భవన్ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఫ్లాగ్ డే సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు రన్​లో పాల్గొని పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తుండడం అభినందనీయమన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో కరీంనగర్ రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు.  కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, ప్రతాప్, ఎస్ బీఐ వెంకటేశ్వర్లు, సీఐలు నటేశ్, లక్ష్మీబాబు, దామోదర్ రెడ్డి, రవీందర్, తిరుమల్ గౌడ్ పాల్గొన్నారు. 

‘బీజేపీతోనే రైతుల సమస్యలకు పరిష్కారం’

జగిత్యాల, వెలుగు: బీజేపీతోనే తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రైతు ఐక్య వేదిక మాజీ అధ్యక్షుడు, బీజేపీ లీడర్ పన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల పాత బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు రైతులతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో జరిగే బీజేపీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. తనతోపాటు భారీగా రైతు ఐక్య వేదిక లీడర్లు బీజేపీలో చేరతారని పేర్కొన్నారు.  

నవ్య కాలేజీలో ఫ్రెషర్స్ డే 

జగిత్యాల రూరల్, వెలుగు: స్థానిక నవ్య బాలికల జూనియర్ కాలేజీలో శనివారం ఘనంగా ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జగిత్యాల జడ్పీ చైర్​పర్సన్​దావ వసంత, మున్సిపల్ చైర్​పర్సన్ ​భోగ శ్రావణి  మాట్లాడారు. హైదరాబాద్ కాలేజీలకు దీటుగా ర్యాంకులు సాధిస్తూ, ఉత్తమ విద్యా బోధన చేస్తున్న నవ్య కాలేజీ లెక్చరర్లను అభినందించారు. అనంతరం ఇంటర్మిడియట్​లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన స్టూడెంట్లకు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్, ప్రిన్సిపల్ గాలిపెల్లి ఈశ్వర్, అధ్యాపకులు, స్టూడెంట్లు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

కొత్తపల్లి, వెలుగు: సైబర్‌‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ ఏఎస్సై స్వప్న అన్నారు. పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ స్టూడెంట్లకు శనివారం సైబర్‌‌ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ ఫోన్లకు వచ్చే మోసపూరిత మెసేజ్‌‌లను నమ్మొద్దని, ఓటీపీ, యూజర్‌‌ పిన్‌‌, యూపీఐ పిన్‌‌ నంబర్లను ఎవరికీ చెప్పొద్దన్నారు. అనంతరంమోసపోకుండా ఎలా ఉండాలో పాటలు, నాటికల రూపంలో పోలీస్ కళాబృందం స్టూడెంట్స్​కు వివరించారు. కార్యక్రమంలో హెచ్​ఎం కె.జలజారాణి, టీచర్స్ పాల్గొన్నారు.

రైతులు సృజనాత్మకంగా ఆలోచించాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: రైతులు పాత పద్ధతులను వదిలి సృజనాత్మకంగా ఆలోచించాలని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు, బీజేపీ లీడర్​పొల్సాని సుగుణాకర్ రావు అన్నారు. నవంబర్​3,4,5 తేదీల్లో కరీంనగర్ లో  కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు. శనివారం స్థానిక కృషిభవన్ లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మేళాలో 3వ తేదీన రైతులకు అధిక దిగుబడులు, మార్కెటింగ్, 4న డైరీ, పౌల్ట్రీ, మత్స్యకారులు, గొర్రె పెంపకం దారులు, నేత, గీత రంగాలపై అవగాహన, 5న మహిళా సంఘాలకు పంట ఉత్పత్తులు, మార్కెటింగ్ పై అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో లింగంపల్లి శంకర్, కంచర్ల పరుశరాములు, తదితరులు పాల్గొన్నారు.

మానేర్​ స్కూల్ లో ఫార్మర్స్‌‌ డే

రైతుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక  పద్మనగర్‌‌లోని మానేర్‌‌ సెంట్రల్‌‌ స్కూల్‌‌ లో శనివారం ఘనంగా ఫార్మర్స్‌‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మానేర్ విద్యాసంస్థల అధినేత కడారు అనంతరెడ్డి మాట్లాడారు. రైతు పండించే పంటలపై అందరికి అవగాహన ఉండాలన్నారు. స్కూల్​విద్యార్థులు రైతుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా వరి సాగు కోసం నాట్లు వేసే విధానం, కూరగాయలను ఎలా  పండించాలనే విషయాన్ని చిన్నారులు నాటిక ద్వారా చూపించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ పాల్గొన్నారు.