ఉద్యమకారులు, కళాకారులకు BRS హయాంలో న్యాయం జరగలే: ఎన్.శంకర్

ఉద్యమకారులు, కళాకారులకు BRS హయాంలో న్యాయం జరగలే: ఎన్.శంకర్

​కోల్​బెల్ట్​,వెలుగు: తెలంగాణ స్వ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులకు బీఆర్ఎస్ హయాంలో న్యాయం జరగలేదని సౌత్​ఇండియా డైరెక్టర్స్ అసోసియేషన్​ ప్రెసిడెంట్, డైరెక్టర్ ఎన్​.శంకర్​అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఆదరణ చూపుతుందని ఆశిస్తున్నానన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాల జిల్లా మందమర్రికి వచ్చిన సందర్భంగా  తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు,  స్థానిక కళాకారులతో కలిసి టౌన్ లోని హజ్రత్ మౌలాలీ దర్గాను సందర్శించి దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళలు, కళాకారులు, రచయితలు, ఉద్యమకారులకు సింగరేణి పుట్టినిల్లని,  సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.  జై బోలో తెలంగాణ షూటింగ్ లో సమయంలో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటాలనే ఉద్ధేశంతో మతాలకు అతీతంగా అందరూ దైవంగా భావించే పీర్లను సినిమాలో ప్రదర్శించామని, మందమర్రికి చెందిన గఫూర్ బాబా పీర్లను ఉపయోగించినట్టు గుర్తుచేశారు.  ఇప్పుడిక్కడికి వచ్చి పీర్ల మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.  15వ  శతాబ్దం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాలతో వెబ్ ​సీరిస్​ను తీస్తున్నట్టు  చెప్పారు. అనంతరం డైరెక్టర్ ​శంకర్​ను స్థానిక కళాకారులు సన్మానించారు.