కేసీఆర్ మతం పేరుతో రాజకీయం చేయలేదు : కేటీఆర్

కేసీఆర్ మతం పేరుతో రాజకీయం చేయలేదు : కేటీఆర్
  •  సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్

రాజన్నసిరిసిల్ల/బోయినిపల్లి, వెలుగు: కేసీఆర్ మతం పేరుతో ఎప్పుడూ రాజకీయం చేయలేదని, ఆయన అన్ని మతాలను సమానంగా చూశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. ఆయన అభిమాని బత్తుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు సొంత ఖర్చుతో ఏర్పాటు చేయించిన టీ స్టాల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించి తెలంగాణలో గంగా జమున తహజీబ్ ను దేశంలోనే  మొదటి స్థానంలో ఉంచింది కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కరేనన్నారు. ప్రజాబలంతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, లీడర్లు గుడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్ ఉన్నారు. అంతకుముందు బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బూర్గుల నందయ్యను పరామర్శించారు. 

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు 

కరీంనగర్/తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  వెలుగు: కరీంనగర్ బైపాస్ రోడ్ లోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంకమ్మ తోట వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణచౌక్ నుంచి మీదుగా బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ కరీంనగర్ అర్బన్ అధ్యక్షుడు హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.  కాగా ర్యాలీలో కోతిరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు తన బుల్లెట్‌‌‌‌‌‌‌‌తో వేగంగా వస్తూ అక్కడే విధుల్లో పద్మజ అనే కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడంతో ఆమె కాలు విరిగింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న కేటీఆర్.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఆమెను పరామర్శించారు. అంతకుముందు తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రాం విగ్రహాలను ఆవిష్కరించాలని పొలిటికల్‌‌‌‌‌‌‌‌ జేఏసీ చేస్తున్న దీక్షా శిబిరాన్ని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్శించారు. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయంతిలోగా విగ్రహాలను ఆవిష్కరించేలా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.