కరీంనగర్ టౌన్/కొడిమ్యాల,వెలుగు: వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బుధవానం ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. కరీంనగర్ లోని చైతన్యపురి మహాశక్తి టెంపుల్ వద్ద జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపురం, నల్లగొండ గ్రామాలకు చెందిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చొప్పదండి, ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బొడిగె శోభ, ఎస్.కుమార్ , పార్టీ మండల అధ్యక్షుడు రేకులపల్లి రవీందర్ రెడ్డి, బండ నరసింహ రెడ్డి , కడకుంట్ల శోభన్ , కాసాని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.