- ఉద్యమకారుల జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు : ప్రభుత్వం తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ప్రపుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్లో కళాకారుల హక్కుల సాధన కోసం ఆట పాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
సుల్తాన్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ప్రపుల్ రాంరెడ్డి మాట్లాడుతూ కళాకారులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలన్నారు. రూ. 30 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రెజరర్చంద్రశేఖర్, గంటి చంద్రుడు, షేఖ్ షావలి, మోహన్ బైరాగి, ఇంద్రి పాల్గొన్నారు.