చండూరు, మునుగోడు, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని మంగళవారం కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చండూరు మండలం కస్తాలలో ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంక్ డైరెక్టర్ కట్టబిక్షంతో ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. మునుగోడు కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు బీసం విజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం ఆందోల్ మైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గట్టుప్పల మండలంలోని శేరిగూడెం రామాలయంలో నాయకులు పంకర్ల నారాయణ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కస్తాలలో ఎంపీటీసీ నాతాల వనజ విష్ణువర్ధన్ రెడ్డి , మాజీ సర్పంచ్ బొమ్మరబోయిన సైదులు, ప్రేమలత , మేకల మమతా సాగర్ రెడ్డి ,పంగారామకృష్ణ, బెల్లి పూర్ణ యాదవ్, మునుగోటి సాయి కుమార్, పాలకూరి మహేశ్ గౌడ్, వేద సాయి, పృథ్వి నేత,శేరిగూడెం లో పంకర్ల చంద్రయ్య, గోడేటి సురేశ్, శ్రీనివాస్, పంకర్ల ఐలయ్య పాల్గొన్నారు.