జగిత్యాల రూరల్, వెలుగు: ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం ఓ ఫంక్షన్ హాల్‌లో పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి పనిచేశామని, కానీ పదేండ్లు అధికారంలో ఉన్నా తమకు న్యాయం జరగలేదన్నారు.
పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు కట్టబెట్టి ఉద్యమకారులను అవమానించారన్నారు. పార్టీకి రిజైన్ చేసినవారిలో మాజీ మున్సిపల్ చైర్మన్జీఆర్ దేశాయ్, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జితేందర్, టీబీసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, కార్మిక విభాగం టౌన్ ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్, గంగాధర్, కిషన్, సత్యనారాయణ ఉన్నారు.