
అమెరికాలోనిన ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్ను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. శనివారం (మార్చి8) రాత్రి నైరుతి స్కాట్లాండ్లోని ట్రంప్ బెర్రీ గోల్ఫ్కోర్సు, హోటల్ లక్ష్యంగా దాడులు చేశారు. గోల్ఫ్ పచ్చికపై గాజా ఈజ్ నాట్ ఫర్ సేల్ అని పెద్ద అక్షరాలతో రాశారు. క్లబ్ గోడపై ఎరుపు స్ర్పే పెయింట్ వేశారు.
గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్ల వెంటనే ఖాళీ చేయాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా స్కాట్లాండ్లో పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తాయి. స్కాట్లాండ్‌లోని ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌లలో ఒకదానిని ధ్వంసం చేశామని పాలస్తీనా అనుకూల కార్యకర్తలు శనివారం ప్రకటించారు.
గాజాను తన ఆస్తిగా భావిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.. అందుకే తనకు నచ్చినవిధంగా గాజాను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తున్నట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ తెలిపింది. ఇది ట్రంప్ కు మంచిది కాదని చెప్పేందుకే అతని స్వంత ఆస్తులను ధ్వంసం చేశామని ఓ ప్రకటనలో ఆందోళన కారులు తెలిపారు. శనివారం తెల్లవారుజాము గోల్ఫ్ కోర్సు ధ్వంసం అయినట్లు ఫిర్యాదు అందుకున్న స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ | అట్టుడుకుతోన్న సిరియా..1000 మంది మృతి... వీధుల్లో, ఇళ్లలో ఎక్కడ చూసినా డెడ్ బాడీలే
ఇజ్రాయెల్,హమాస్ మధ్య 15 నెలల యుద్ధానికి విరామం ఇస్తూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే మొదటి దశ, రెండవ దశ ఒప్పందం ఇంకా అమలులోకి రాకపోవడంతో గాజా భవిష్యత్తు గందరగోళంలో పడింది.
ఇంతలో గాజాలోని పాలస్తీనా ప్రజలు వేరేచోటికి శాశ్వంతంగా వెళ్లిపోవాలని ప్రకటన చేయడం, ఆ భూభాగం స్వాధీనం చేసుకొని ఇతరుల కోసం అభివృద్ధి చేస్తామని .. పాలస్తీనియన్లు వెంటనే వెళ్లిపోవాలని ట్రంప్ చెప్పడంతో పాలస్తీనా మద్దతుదారులు స్కాట్లాండ్ లో నిరసనలు వ్యక్తం చేశారు.