‘ప్రేమదేశం’ లాంటి చిత్రాలతో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న అబ్బాస్.. కొన్ని చిత్రాల్లో కీలకపాత్రలు కూడా పోషించాడు. ఆ తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రాలేవీ మెప్పించకపోవడంతో క్రమంగా సినిమాలు తగ్గాయి. గత పదేళ్లుగా సినిమాలకు దూరమైన అబ్బాస్.. విదేశాల్లో ఉంటున్నాడు. తాజాగా అతను రీఎంట్రీకి రెడీ అయ్యాడు.
Also Read :- స్థిరంగా బంగారం ధరలు..ఇవాళ (ఫిబ్రవరి6) ఎంతంటే
‘విక్రమ్ వేద’ చిత్రంతో మెప్పించిన దర్శకద్వయం పుష్కర్, గాయత్రి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. తమిళ దర్శకుడు సర్గుణం తెరకెక్కించే ఈ వెబ్ సిరీస్‌లో అబ్బాస్ లీడ్ రోల్‌లో నటించబోతున్నాడట. ‘ఎగ్జామ్’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రంలో దుషారా విజయన్ కీలకపాత్ర నటించబోతున్నట్టు తెలుస్తోంది.