
అభినవ్ గోమటం(Abhinav Gomatam).. అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ, నైంటీ ఎసినట్టున్నడు సైకో సాలెగాడు.. అనే డైలాగ్ చెప్తే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఈ నగరానికి ఏమైంది సినిమా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కమెడియన్. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించి ఆడియన్స్ ను అలరించాడు. ఇటీవల మస్త్ షేడ్స్ ఉన్నాయి రా.. అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వస్తున్న ఈ సినిమాలో మనిషి చిల్లర హీరోయిన్ గా నటిస్తుండగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కిస్తున్నారు.
మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 25న జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు అభినవ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాకు చిరంజీవి గారు గురించి ఒకటే అనిపిస్తది. ఇటీవల ఆయన జిమ్ చేస్తూ ఒక వీడియో పెట్టారు. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో పాత్రలు చేసి, పద్మవిభూషణ్ లాంటి అవార్డ్స్ తీసుకొని.. తరువాతి సినిమా కోసం జిమ్ చేస్తున్నారు అంటే.. నాకనిపించింది ఆయన ఇంకా ఎందుకు అంతలా కష్టపడుతున్నారు. ఆయన సాదించాల్సినవి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా.
ఇన్ని సంవత్సరాల నుండి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న చిరంజీవి గారికి మనం రిట్టర్న్ గిఫ్ట్ ఎం ఇవ్వగలం. కనీసం ఆయన నెక్స్ట్ సినిమా విశ్వంభర కైనా అవాయిడ్ రివ్యూ. అయినా చిరంజీవి సినిమాకు రివ్యూలు ఏంటి భయ్యా.. జస్ట్ చూసి సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. #ChiruTribute అని చెప్పి ఎండ్ చేయాలి అంతే. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు అభినవ్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు. అభినవ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అభినవ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.