ఐశ్వర్యారాయ్కు ఈడీ నోటీసులు

ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిందని సమాచారం. పనామా పేపర్ల కేసులో ప్రమేయం ఉందనే కారణాలతో ఐశ్వర్యకు ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. విదేశాల్లో సంపదను దాచారనే ఆరోపణలపై 48 ఏళ్ల ఐష్ ను ఈడీ ప్రశ్నించనుంది. ఇప్పటికే రెండుసార్లు ఈడీ ముందు హాజరవ్వాలని ఐశ్వర్యకు సమన్లు జారీ అయ్యాయి. కానీ తనకు మరింత సమయం ఆమె కావాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మరోమారు నోటీసులు ఇవ్వడం గమనార్హం. 

కాగా, 2016లో బయటకొచ్చిన పనామా పేపర్ల కేసులో ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, నటులు, క్రీడాకారులు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ట్యాక్స్ తప్పించుకునేందుకు షెల్ కంపెనీలు లేదా ఆఫ్ షోర్ అకౌంట్లను ఏర్పాటు చేయడం వెలుగు చూసింది. ప్రముఖ పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్స్ తోపాటు సెలబ్రిటీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు లీకవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ రికార్డులను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు పబ్లిష్ చేయడంతో ఈ వ్యవహారం గురించి అందరికీ తెలిసింది. పనామా పేపర్లలో దాదాపు 3 వేల మంది భారతీయులకు ప్రమేయం ఉన్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తల కోసం: 

ముళ్లపై పడుకొని అత్తారింటికి సాగనంపారు

ఒక్కరోజులో 10 వేల మందికి ఒమిక్రాన్

ఫిలిప్పీన్స్ లో ‘రాయ్’ బీభత్సం