ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ఈనెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ ‘మా నాన్న స్టేజ్ యాక్టర్ కావడంతో చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా. 12 క్లాస్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యా. కొన్ని యాడ్స్ చేశా. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చాన్స్ వచ్చింది. కథ విన్నప్పుడు నాది చాలా బలమైన క్యారెక్టర్ అనిపించింది.
మెడికల్ స్టూడెంట్‌గా బాగీ అనే పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్‌లో ఫన్ కూడా ఉంటుంది. ఇందులో మంచి ప్రేమ కథను చూస్తారు. కొన్ని మంచి విషయాలు కూడా చెబుతున్నాం. తెలుగమ్మాయిని కాకపోవడం వల్ల లాంగ్వేజ్ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా. అది తప్ప సెట్‌లో నటిస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ధర్మతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఇందులో క్యారెక్టర్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం అతనిది.
డైలాగ్స్ చెప్పడంలో నాకు సపోర్టివ్‌గా ఉన్నాడు. సాయి పాత్రలో తను బాగా పెర్ఫార్మ్ చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో దీనికి పోలిక లేదు. అర్జున్ రెడ్డి క్లాసీ డ్రింకర్. మా సాయి మాసీ డ్రింకర్. తెలుగు సినిమాలను సహజంగా రూపొందిస్తుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో పార్ట్ అవడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.