యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పటేల్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో అజయ్ కనిపించనున్నాడు.
సోమవారం అక్టోబర్ 14న తన పాత్రను పరిచయం చేస్తూ కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు వేట కుక్కలను పట్టుకొని రగ్డ్ గా కనిపిస్తున్న అజయ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదొక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమని, అజయ్ పాత్ర హైలైట్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
An Epic Role for the Greatest Performer❤️🔥
— NISA ENTERTAINMENTS (@NisaEnt) October 14, 2024
The best of the best, versatile actor #Ajay will stun you as Patel in #Pottel 🐐💥
Witness his Wrath in CINEMAS on OCTOBER 25TH🔥@YuvaChandraa @AnanyaNagalla @Dir_Sahit @nishankreddy17 @SureshKSadige @NisaEnt @pscreations_psc… pic.twitter.com/hQ783cGMit
ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.