
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమా గురించి నటుడు అజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ విన్నతరువాత దేవర సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. నటుడు అజయ్ దేవర సినిమాలో కీ రోల్ చేస్తున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దేవర సినిమా గురించి అడగగా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అజయ్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. దేవర సినిమా స్టోరీ పరంగానే కాదు.. ఎలివేషన్ పరంగా కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఈ ఏడాది రాబోయే సినిమాలలో దేవర ది బెస్ట్ మూవీగా ఉండనుందని.. ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక అజయ్ చేసిన ఈ కామెంట్స్ తో దేవర సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ కామెంట్స్ విన్నాక.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. దేవర సినిమా విడుదల అయ్యాకా కలెక్షన్స్ ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూస్తారని, ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయమని అంటున్నారు. ఇక దేవర సినిమా అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రానుంది.