
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)కు పెను ప్రమాదం తప్పింది. మరోసారి అజిత్ కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలో జరిగిన యూరోపియన్ కార్ రేస్‌లో పాల్గొంటూ, నేడు ఏప్రిల్ 19న ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో అజిత్ కుమార్ కు పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.
అజిత్ కుమార్ 180 కి.మీ. వేగంతో రేసు కోసం ప్రాక్టీస్ చేస్తుండగా, అతని కారు ఒక డివైడర్ను ఢీకొని వెనక్కి తిరిగింది. దీనివల్ల ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. కారు ముందు, వెనుక భాగాలు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి.
అయితే, శిక్షణ సమయంలో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనని అజిత్ కుమార్ వివరించినట్లు తెలుస్తోంది. అజిత్ కుమార్ బృందం విదేశాలలో వివిధ కార్ రేసింగ్ పోటీలలో పాల్గొంటూన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#AjithKumarRacing #AjithKumar
— SUN'S Friday ☀️🌊 (@SUNSFRIDAY) April 19, 2025
Ajith Sir Racing Car Accident: pic.twitter.com/GOn0GADCcw
గడిచిన నాలుగు నెలల వ్యవధిలో అజిత్‌కు జరిగిన మూడో ప్రమాదం ఇది. జనవరి నెలలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా ఆయన కారు సమీపంలోని గోడను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం డ్యామేజ్ కాగా.. అప్పుడు కూడా అజిత్ క్షేమంగా బయటపడ్డాడు.
#AjithKumar #AjithKumarRacing
— SUN'S Friday ☀️🌊 (@SUNSFRIDAY) April 19, 2025
Ajith Sir 👍👍👍👍 Good pic.twitter.com/kaxq9z0VlK
రేసింగ్ అంటే అజిత్‌కు మహా ఇష్టం. సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ దొరికితే చాలు బైక్స్, కార్లతో చక్కర్లు కొడుతుంటారు. అలా తరుచూ ప్రమాదాలకు గురవుతూ అభిమానులను ఆందోళన కలిగేలా చేస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.