2024 ఎన్నికల్లో ఘోర ఓటమి నుండి బయటకు రాకముందే వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్ తగిలింది.నటుడు అలీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతే కాదు,రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు అలీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీ సపోర్టర్ ని కూడా కాదని చెప్పుకొచ్చారు అలీ. ఇకపై సినిమాలు, షూటింగ్స్ పైనే దృష్టి పెడతానని, సామాన్యుడిలాగా ఐదేళ్లకోసారి వెళ్లి ఓటు వేసి వస్తానని అన్నారు.
ఇక మీదట రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు అలీ. అలీ తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపినట్లు తెలుస్తోంది.2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన అలీ 2022 నుండి ఏపీ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా వ్యవహరించారు.
2019, 24 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాష్ట్రమంతా ప్రచారం చేసిన అలీ.. రాజ్యసభ ఎంపీ పదవి, వక్ఫ్ బోర్డు ఛైర్మెన్, ఎమ్మెల్సీ ఇస్తారని భావించినా ఆయనకు ఏ పదవులు దక్కలేదు.గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు అలీ.ఇక కూటమి ప్రభుత్వానికి టాలీవుడ్ అంతా మద్దతు తెలుపుతున్న సందర్భంలో అలీ రాజకీయాలకు సవస్తి పలకటం హాట్ టాపిక్ గా మారింది.