
ప్రముఖ నటుడు అల్లరి నరేష్ మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. విజయ్ కనకమేడల కాంబోలో వచ్చిన నాంది చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కాగా.... తాజాగా మళ్లీ అదే కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి ఉగ్రం అనే టైటిల్ ను ఖరారు చేసిన చిత్ర బృందం.తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. పేరు తగ్గట్టుగానే పోస్టర్ లో కూడా అల్లరి నరేష్ ఉగ్ర రూపం ప్రదర్శించడాన్ని గమనించవచ్చు. దీన్ని చూస్తుంటే పూర్తిగా వైల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్టు గోచరిస్తోంది.
వీపు భాగంలో కత్తి గుచ్చుకొని ఉన్న అల్లరి నరేష్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది ప్రేక్షకులకు ఈ చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తించేటట్టు ఉంది. ఎక్కువగా కామెడీ జోనర్లో సినిమాలు తీసిన అల్లరి నరేష్.. యాక్షన్ జోనర్లో చేసిన సినిమాలతోనూ అందర్నీ అలరించాడు. ఇప్పుడు ఉగ్రంతో మరోసారి తన టాలెంట్ ను చూపించడానికి రెడీ అయ్యాడు ఈ అల్లరి హీరో. కాగా ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.