జగన్ కి కుల పిచ్చి మత పిచ్చి వుందని నిరూపించ గలరా?

  • పవన్ కళ్యాణ్ కు జగన్ ను అసలు ప్రశ్నించే అర్హత ఉందా..?
  • పవన్ కళ్యాణ్ తనే ప్రశ్నిస్తాడు తానే జవాబు చెపుతాడు
  • పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి విసుర్లు

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు.  జగన్ కి కుల పిచ్చి మత పిచ్చి వుందని నిరూపించ గలరా? అంటూ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కు జగన్ ను అసలు ప్రశ్నించే అర్హత ఉందా..? పవన్ కళ్యాణ్ తనే ప్రశ్నిస్తాడు తానే జవాబు చెపుతాడు అంటూ.. పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి ఎద్దేవా చేశారు. సోమవారం నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించారు. నాకు చిన్నప్పటి నుంచి ప్రేశ్నించే గుణం వుందని ఈ సందర్భంగా పోసాని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు..అప్పుడు ప్రశ్నిస్తా అని అన్నారు తప్పు లేదు. పవన్ కళ్యాణ్ తనే ప్రశ్నిస్తాడు తానే జవాబు చెపుతాడని విసుర్లు విసిరారు. 

చచ్చే వరకు జగన్ అభిమానిగానే ఉంటా
వైఎస్ జగన్ పార్టీ పెట్టకముందు నుంచే తాను ఆయన అభిమానినని, చచ్చిపోయి వరకు జగన్ అభిమానిగా వుంటాననని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. పదవులు ఇస్తాము అన్నా నాకు వద్దని అన్నానని తెలిపారు. చిరంజీవి నోటి వెంట ఒక బ్యాడ్ మాట విన్నారా.. ? మీరు ఎవరిని ప్రేరణ గా తీసుకొని బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. సాయి ధరమ్ తేజ్ తన రెక్కల కష్టం తో పైకి వచ్చాడు.. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ జగన్ ని, మంత్రులను తిట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది అని ప్రశ్నించారు. జగన్ కి కుల పిచ్చి మాత పిచ్చి వుందని నిరూపించ గలరా? జగన్ తన నియోజక వర్గానికి వెళ్లక పోయినా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, మీరు రెండు నియోజక వర్గ లలో నుంచున్నారు.. గెలిచారా?? అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. 
ఆ అమ్మాయి తరపున మీరు పోరాటం చేస్తే పవన్ కు గుడి కడతా.. ఆ అమ్మాయికి న్యాయం చేస్తే జగన్ కూడా మీ ముందు పనికిరాడు
ఒక సినిమాలో ఆడవాళ్ళు జోలికొస్తే కళ్ళు పికేస్తా అన్నారు మీరు.. పంజాబ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఇండస్ట్రీలో ఒక ప్రముఖుడు అవకాశాలు ఇస్తానని మోసం చేశాడు, ఆ అమ్మాయిని బలవంతంగా అబార్షన్ చేయించారంట. అతను  ఒక ప్రముఖ వ్యక్తి. ఆ ప్రముఖు వ్యక్తి  పేరు పవన్ కళ్యాణ్ గారికి చెపుతాను, మీరు ఆ అమ్మాయి తరుపున నిలబడి ఆ ప్రముఖ వ్యక్తి  మీద పోరాటం చేస్తే నేను మీకు గుడి కడతాను.. ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా.. అప్పుడు మీ ముందు జగన్ కూడా పనికి రాడు సార్.. ఆ అమ్మాయి కి మీరు అండ దండలు అందించకపోతే మీకు ఎవ్వరినీ ప్రశ్నలు అడిగే అర్హత లేదని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రపంచానికి తెలుసు, ఇండస్ట్రీ కి తెలుసు, పవన్ ....మీరు జగన్ తో పోల్చకోవద్దు.. వెళ్లవయ్య పవణ్ కళ్యాణ్.. అంటూ విసుర్లు విసిరారు. జగన్ రాకముందు గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి..? ఇప్పుడు ఏమిటి.. ? వెళ్లి చూడమని ఆయన సలహా ఇచ్చారు.