
బబ్లూ పృథ్వీరాజ్(Babloo Prithiveeraj).. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చాలా సినిమాల్లో తనదైన శైలీలో మెప్పించారు పృథ్వీరాజ్. సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించారు. అయితే కొంతకాలం సినిమాలకు దూరంగా పృథ్వీరాజ్ ఈ మధ్య వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల రామ్ స్కందలో చిన్న పాత్ర చేసిన పృథ్వీరాజ్.. ఇవాళ(డిసెంబర్ 1) విడుదలైన యానిమల్ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమా సక్సెస్ తో మరిన్ని అవకాశాలు అందుకోనున్నారు పృథ్వీరాజ్.
ఇదిలా ఉంటే.. ప్రొఫెషనల్ గా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్ మాత్రం కాస్త డిస్టర్బింగ్ గానే సాగుతోంది. ఆయన తన రెండో భార్య శీతల్‌తో విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం పృథ్వీరాజ్ రెండో భార్య తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ నుండి పృథ్వీరాజ్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను డిలేట్ చేయడమే. దీంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ జంట గత ఏడాదే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. లైఫ్ లాంగ్ కలిసుంటారనుకున్నారు కానీ.. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థాల కారణంగా విడిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.