సొంతగూటికి బాబూమోహన్

సొంతగూటికి బాబూమోహన్
  • టీడీపీ సభ్యత్వం తీసుకున్న మాజీ మంత్రి ​

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, నటుడు బాబూమోహన్​ సొంతగూటికి చేరుకున్నారు. ఆయన మళ్లీ  టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆందోల్​ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్నట్టు  తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఫొటోను విడుదల చేశారు. బాబూ మోహన్​ తొలిసారి1998 ఉప ఎన్నికల్లో ఆందోల్​ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999 లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరి 2004, 2014 ఎన్నికల్లో  పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్​ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రిజైన్​ చేసి కేఏ పాల్​ స్థాపించిన ప్రజాశాంతి పార్టీలోకి వెళ్లారు.  తాజాగా బాబూ మోహన్​ టీడీపీలో చేరినట్టు ఓ ఫొటో విడుదల చేశారు.