Basil Joseph: పండంటి బిడ్డకు తండ్రైన నటుడు

Basil Joseph: పండంటి బిడ్డకు తండ్రైన నటుడు

ప్రముఖ నటుడు, డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. తన భార్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి.. బిడ్డ పుట్టే రోజు వరకు తమ ఆనందం మరింత ఎక్కువైందని చెప్పాడు. తను బిడ్డను ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... తండ్రి అయిన ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురికి హోప్‌ ఎలిజబెత్‌ బాసిల్‌ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. దీంతో ఆయనకు మలయాళ సినీ ప్రముఖులు, నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బాసిల్ జోసెఫ్ నటించిన జయ జయ జయ హే చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యి ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు మలయాళంలోనూ వినూత్న కథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కుంజీరమాయనమ్, గోధా వంటి చిత్రాలతో మాలీవుడ్‭లో ఫేమస్ అయ్యాడు. జయ జయ జయ హే చిత్రంతో పాటు 2022లో వచ్చిన పాల్తూ జన్వార్ కూడా జోసెఫ్ కు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో పశువుల డాక్టర్ వద్ద పని నేర్చుకునే కాంపౌండర్‭గా నటించాడు. ఇక మిన్నల్ మెరళి చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా పలు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది.