
బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో సీనియర్ నటి ఆమని, బలగం నటుడు సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బాపు’. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.
బాపు ఓటీటీ:
తెలంగాణ విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన బాపు మూవీ ఓటీటీ హక్కులను జియోహాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మార్చి 7 నుంచి జియోహాట్‌స్టార్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇందులో నటించిన ప్రతిఒక్కరు తమదైన కామెడీ, ఎమోషనల్, సీరియస్ పాత్రల్లో మెప్పించారు.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ వ్యవసాయ కుటుంబం ఎమోషనల్ జర్నీని ఇందులో చూపించారు. కుటుంబ సభ్యుల మనుగడ కోసం ఒకరు తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఆ ఫ్యామిలీలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది హ్యుమర్, ఎమోషన్స్ కలయికలో డార్క్ కామెడీ డ్రామాగా రూపొందించారు.
One man’s story, one family’s journey! #BaapuonJioHotstar Streaming from 7th Mar only on #JioHotstar@actorbrahmaji @DhanyaBee @Sri_Avasarala @dayakar_daya @MadhuraAudio @comrade_film_factory @mani_aegurla @rrdhru1 @abitha_venkat @vasupendem @aalayamanil @lyricsshyam… pic.twitter.com/uCeoymCvkP
— JioHotstar Telugu (@JioHotstarTel_) March 1, 2025
బాపు కథేంటంటే:
మల్లయ్య (బ్రహ్మాజీ) ఒక పేద రైతు. ఊర్లో ఎదురైనా చోట అప్పులుచేస్తాడు. ఇక చేసిన అప్పు తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడతాడు. ఎలాగైనా ఈ సారి వచ్చే పత్తి పంటతో అప్పు తీరుస్తానని ధైర్యంతో ఉంటాడు. కానీ, అయితే, మల్లన్న కొడుకు రాజు (మణి ఎగుర్ల) నిర్లక్ష్యం వల్ల ఆ పంటంతా వర్షార్పణం అయిపోతుంది. దాంతో అప్పులోళ్లు ఇంటిమీద, తన ఎకరం పొలం మీద పడుతారు. ఇచ్చిన గడువులో అప్పు తీర్చకపోతే పొలాన్ని జప్తు చేస్తామని హెచ్చరిస్తారు. దాంతో చేసేదేం లేక మల్లయ్య ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. అయితే, ప్రభుత్వం నుండి వచ్చే రైతు బీమా రూ.5 లక్షలతో ఎంతో కొంత అప్పు తీరుతుందనుకుంటాడు. మల్లయ్య నిర్ణయానికి తన భార్య సరోజ (ఆమని) అడ్డు చెబుతుంది. కావాలంటే ప్రభుత్వం నుండి వచ్చే ఆ డబ్బు కోసం మీ నాన్నని రాజయ్య(బలగం సుధాకర్ రెడ్డి)ని చంపేస్తే మంచింది కదా అనే సలహా ఇస్తోంది. దాంతో ఇద్దరు భార్యాభర్తలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? మరి ఇంటి కోసం రాజయ్య ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడా? చివరికి ఏమైందనేది బాపు కథ.