రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ బెయిల్ పిటిషన్లను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1గా, దర్శన్ ఏ2గా ఉన్నారు.
దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. పవిత్ర గౌడ బెంగళూరులోని పరప్పన అగ్రహారలో ఉన్నారు. దర్శన్ బెంగుళూరు సెంట్రల్ జైలులో ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ పొందుతున్నట్లు ఫోటోలు వెలువడటంతో బళ్లారికి బదిలీ చేశారు. బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో పవిత్ర గౌడ కన్నీరుమున్నీరుగా విలపించినట్లు సమాచారం.
ఏంటి ఈ కేసు..?
33 ఏళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటుడు దర్శన్‌కి వీరాభిమాని. కానీ అతను దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో హత్యకు గురయ్యాడు. పతకం ప్రకారం అతన్ని దర్శన్, పవిత్ర గౌడసహా మరికొందరు కలిసి హత్య చేశారు. జూన్ 9న అతని మృతదేహం సుమనహళ్లిలో ఓ మురికినీటి కాలువలో దొరికింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని గంటల అనంతరం దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురిని అరెస్టు చేశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని కోర్టు విచారించింది. ఈ ఆరుగురిలో ఇద్దరికి బెయిల్ మంజూరు కాగా, దర్శన్, పవిత్ర గౌడ సహా మిగిలిన నలుగురి బెయిల్ అభ్యర్థనలు తిరస్కరించబడ్డాయి.
ALSO READ | కొరియోగ్రాఫర్ జానీకి బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు