Kalinga Premiere Review: కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కళింగ.. ప్రీమియర్ షోస్ తో పాజిటివ్ టాక్

Kalinga Premiere Review: కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కళింగ.. ప్రీమియర్ షోస్ తో పాజిటివ్ టాక్

‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు (Dhruva Vayu) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కళింగ’(Kalinga). దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. శుక్రవారం సెప్టెంబర్ 13న సినిమా విడుదలవుతున్న సందర్భంగా..సెప్టెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు, హీరో తిరువీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని బెస్ట్ విషెస్ చెప్పారు.

హీరో ధృవ వాయు మాట్లాడుతూ ‘ట్రైలర్ చూసిన వాళ్లంతా కాంతార, విరూపాక్ష,  మంగళవారం చిత్రాలతో పోలుస్తున్నారు. కానీ ఇదొక కొత్త కాన్సెప్ట్ మూవీ. చాలా కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇస్తుంది’ అని చెప్పాడు. ‘ధృవ వాయు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. ఆయన డెడికేషన్, ప్యాషన్ వల్లే ఈ చిత్రం సాధ్యమైంది’ అని నిర్మాతలు చెప్పారు.  హీరోయిన్ ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, బలగం సంజయ్ పాల్గొన్నారు.  

Also Read:-హీరో ధనుష్ పై రెడ్ కార్డ్ రద్దు!..ఆనందంలో అభిమానులు

ఇదిలా ఉంటే..ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోంది.కానీ ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో సినిమా విడుదలకు ముందే అనగా రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు..ఈ సినిమాని "కాంతారా", "మంగళవారం" లాంటి సినిమాలతో పోల్చి చూస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. 

కథ:

కళింగ ఊర్లో అనాథ అయిన లింగ (ధృవ వాయు) సారా కాస్తూ ఉంటాడు..ఆ ఊరి పెద్ద (ఆడుకాలమ్ నరేన్), అతని తమ్ముడు బలి (బలగం సంజయ్) తమ గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. బలి కనిపించిన ఆడవాళ్ల మీద దారుణాలకు ఒడిగడుతాడు. నచ్చిన ఆడవాళ్ళ మీద కన్నేస్తుంటాడు. ఇక లింగ చిన్నతనం నుంచి కూడా పద్దు (ప్రగ్యా నయన్) ప్రేమిస్తుంటాడు. పద్దు కూడా లింగను ప్రేమిస్తుంది. ఇంతలో పద్దు మీద బలి కన్ను పడుతుంది. లింగతో పెళ్లి చేసుకోవడానికి ఓ చిక్కు ముడి వేస్తాడు పద్దు తండ్రి (మురళీధర్ గౌడ్).

ఊరి పెద్ద వద్ద తనఖాలో ఉన్న తన పొలాన్ని విడిపించుకుని వస్తేనే..మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని అంటాడు. దీంతో లింగకి సంస్థానంలోని స్థలం రాసిస్తాడు. అయితే, ఆ సంస్థానంలో జరిగిన నేపథ్యం ఏంటి? ఆ సంస్థానానికి గతంలో ఉన్న శాపం ఏంటి? అక్కడికి వెళ్లిన వాళ్లు మళ్ళీ ఎందుకు తిరిగి రారు? లింగ అంతటి సరిహద్దుని దాటిన తరువాత ఏం జరుగుతుంది? ఇక అందరి మధ్యలో ఉన్న అసుర భక్షి ఏంటి? చివరకు లింగ ఏం చేశాడు? విలన్స్ ఆట ఎలా కట్టించాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమాను థియేటర్లో చూడాల్సిందే. నటుడు ధ్రువ వాయు తన పాత్రకు తగిన న్యాయం చేశాడని చెప్పాలి.మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.