షష్టి పూర్తి చేసుకునే వయసులో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా.?

షష్టి పూర్తి చేసుకునే వయసులో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా.?

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, ఆయన భార్య సునీతా అహుజా 37 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరక్ అవుతున్నాయి. అంతేకాదు గత కొన్నేళ్లుగా నటుడు గోవింద, సునీత అహుజా కలసి ఉండటం లేదని ఈ క్రమంలో సునీత పిల్లలతో కలసి ముంబైలో సెపరేట్ గా ఉంటోందని పలు పుకార్లు వినిపిస్తన్నాయి. 

దీనికితోడు ఈ మధ్య సునీత అహుజా సింగిల్ గా పలు ఇంటర్వూలలో పాల్గొంటోంది. దీంతో ఈ డైవర్స్ రూమర్స్ మరింతగా ఊపందుకున్నాయి. దీంతో కొందరు నెటిజన్లు ఈ విడాకుల గురించి స్పందిస్తూ షష్టి పూర్తి చేసుకునే వయసులో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా.? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై గోవింద మేనకోడలు ఆర్తి సింగ్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇందులోభాగంగా తన మేనమామ గోవింద, సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా చేసే ప్రచారాల కారణంగా తమ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతన్నారని ఇకనైనా ఈ డైవర్స్ రూమర్స్ ని ఆపాలని కోరింది. అయితే పెళ్లయిన తర్వాత నుంచి ఇప్పటివరకూ గోవింద, సునీత అహుజా చాలా సంతోషంగా ఉన్నారని అలాంటిది 37 ఏళ్ళ తర్వాత విడాకులు ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ALSO READ : అప్పు తీర్చిన రూ.18 కోట్లకు లెక్క చూపించూ : ప్రీతి జింటాకు కేరళ కాంగ్రెస్ కౌంటర్

ఇక నటుడు గోవింద పర్సనల్ సెక్రెటరీ శశి సిన్హా కూడా స్పందిస్తూ ఈ డైవర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాడు. అలాగే 30 ఏళ్ళ వయసున్న మరాఠీ నటితో సన్నహితం కారణంగానే నటుడు గోవింద విడాకులు తీసుకుంటున్నాడనేది అవాస్తవమని చెప్పుకొచ్చాడు. అయితే నటుడు గోవిందా ఈమధ్య రోజంతా పని నిమిత్తమై బిజీగా ఉంటున్నాడని అందుకే సునీత అహుజా పిల్లలతో కలసి ముంబై లో ఉంటుందని అంతేతప్ప వేరే ఏం లేదని తెలిపాడు. దీంతో నటుడు గోవింద ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.