2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థికి స్టార్ హీరో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొందరు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‍ను ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై నేడు (జూలై 23) స్పందించారు నటుడు హైపర్ ఆది. వివరాల్లోకి వెళితే..అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శివం భజే’. ఈ మూవీ ఆగస్టు 1న రిలీజ్ కానున్న నేపథ్యంలో నేడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్కు హాజరైన హైపర్ ఆది.. అల్లు అర్జున్ గురించి మాట్లాడారు.
‘అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్టార్..నేషనల్ అవార్డు విన్నర్ కూడా. అలాంటి ఆయనను అందరూ గౌరవించాలి. ట్రోల్ చేయడం ఈ మాత్రం కరెక్ట్ కాదని, ఇకపై ఆపేయాలని హైపర్ ఆది చెప్పారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ సహా మెగా ఫ్యామిలీలో అలాంటి ఫీలింగ్ ఏమీ లేదని అంతా ఒక్కటే. ఇకపోతే, కొంతమంది అల్లు అర్జున్‌ను కావాలనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపేయాలని కోరుతున్నా’ అని ఆది చెప్పుకొచ్చారు.
Also Read :- విజయ్ దేవరకొండ.. ఎలా ఉండే వాడు, ఎలా అయ్యాడు
‘పవన్ కల్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తా. బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటా. పవన్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. నాకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో ఈ మాత్రం నిజం లేదు’..కాకపోతే, ప్రచార సమయంలో చాలా సినిమాలు చేయలేకపోయాను..ఒక మంచి కోసం పోరాడినందుకు..ఫ్యూచర్ లో అంత మంచే జరుగుతుందని ఆశిస్తున్నాని తెలిపారు.
శివంభజే గురించి..
శివంభజే ఆగస్టు 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. 'శివం భజే' అని ఈ సినిమాకు ఆధ్యాత్మికమైన టైటిల్‌ను పెట్టినా..వరుస హత్యలతో, టెర్రరిజం ఆగడాల నేపథ్యంలో ట్రైలర్ అదిరిపోయింది. వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగు అయిపోవాలి' అంటూ 'శివం భజే' ట్రైలర్ స్టార్టింగ్ లో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించగా..ఆ వెంటనే తీవ్రవాదుల్ని చూపించారు. ఇక ఆ పాకిస్తాన్ తీవ్రవాదులతో పాటు డ్రాగన్ దేశానికి చెందిన అధికారులను కూడా ట్రైలర్ లో చూపించడంతో అసలు చైనా పాత్ర ఏమిటి? అనేది ట్రైలర్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది.