తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్నికొన్నాళ్లుగా నవ్విస్తున్న హైపర్ ఆది (Hyper Aadi) స్కిట్స్ చాలా ఫేమస్. తన మార్క్ పంచ్‍లతో దుమ్మురేపారు. ఇప్పుడు అతను ఏం మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా హైపర్ ఆది అశ్విన్ బాబు హీరోగా నటించిన శివంభజే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడగా ఆ మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ట్రోలింగ్ వ్యవహారంతో పాటు తనకు జనసేన ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయం మీద కూడా ఆయన స్పందించారు.
అసలు విషయానికి వస్తే..జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు హైపర్ ఆది వీరాభిమాని. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ఆది విస్తృత ప్రచారం చేశారు. పవన్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో సినిమాలు కూడా ఆపేసి గ్రామగ్రామాన విస్తృతంగా తిరిగారు.
Also Read :- వాళ్లంతా ఒక్కటే.. ట్రోల్ చేయడం ఆపండి
‘పవన్ కల్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తా. బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటా. పవన్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. నాకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు’..కాకపోతే, ప్రచార సమయంలో చాలా సినిమాలు చేయలేకపోయాను..ఒక మంచి కోసం పోరాడినందుకు..ఫ్యూచర్ లో అంత మంచే జరుగుతుందని ఆశిస్తున్నాని తెలిపారు.