విలన్‌గానే కాక, మంచి మంచి పాత్రలతో సెకెండ్ ఇన్సింగ్స్‌లో దూసుకుపోతున్నారు జగపతిబాబు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బిజీయెస్ట్ ఆర్టిస్ట్‌గా మారారు. జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింబా’. ద ఫారెస్ట్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్. మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడు. డైరెక్టర్ సంపత్ నంది కథను అందిస్తూ, రాజేందర్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ప్రకృతి ప్రేమికుడిగా కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. 'ఇదిగో మన ప్రకృతి మాత..మన సొంత బిడ్డ' ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత బాగుంటాం అని తెలిపేలా ట్రైలర్ సాగింది. ఇంకా చెప్పాలంటే..'ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువగా చనిపోతున్నారనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనే మెసేజ్ ఇస్తోంది.