RC 16: రామ్ చరణ్ RC 16 అప్డేట్.. జగ్గూభాయ్ మేకోవర్ వీడియో రిలీజ్

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్తో వస్తోన్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ షురూ చేసింది. ఈ సినిమాలో తెలుగు, తమిళ, మలయాళ విలక్షణ నటులు నటిస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబుకి (Jagapathi Babu) సంబంధించిన RC16 మేకోవర్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు సానా తనని ఎలా మేకోవర్ చేయిస్తున్నాడో చెబుతూ జగ్గూభాయ్ ట్వీట్ చేశాడు. "చాలా కాలం తర్వాత బుచ్చిబాబు సనా RC16 కోసం మంచి పని మొదలు పెట్టాడు. నా గెట్ అప్ చూసిన తర్వాత చాలా తృప్తిగా ఉందంటూ" వీడియోకి జగ్గూభాయ్ క్యాప్షన్ ఇచ్చాడు.

ALSO READ | Saif Ali Khan Attacked : వెన్నెముక నుంచి కత్తి మొన తీసిన డాక్టర్లు..

అయితే మొదటి ఇన్నింగ్స్లో హీరోగా అలరించిన జగపతిబాబు.. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. ఒకవైపు నెగిటివ్ షెడ్స్ చేస్తూనే మరోవైపు మెయిన్ కీ రోల్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం జగ్గూభాయ్ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్ గా రాణిస్తున్నాడు.

ఇక డైరెక్టర్ బుచ్చిబాబు విషయానికొస్తే: ఉప్పెన సినిమా హిట్ అవ్వడంతో తన రెండో సినిమానే ఏకంగా రామ్ చరణ్ తో తీసే ఆఫర్ దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా కథ కోసం దాదాపుగా 5 ఏళ్లు కష్టపడినట్లు గతంలో చెప్పాడు. మరి ఉప్పెనతో ఆకట్టుకున్న బుచ్చిబాబు RC16తో ఎలా అలరిస్తాడో చూడాలి.