OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళ సినిమాలు ఓటీటీకి వస్తున్నాయంటే.. ఆడియన్స్ లో ఓ రకమైన ఫీలింగ్. అక్కడి మేకర్స్ తెరకెక్కించే మేకింగ్ విధానం, నేచురల్ లొకేషన్స్, నటి నటుల సహజ నటన.. ఇలా ప్రతిదీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

ఇటీవలే స్టార్ హీరో జోజు జార్జ్ (Joju George) నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘పాని’(Pani). కథ కూడా అందించాడు. అభినయ హీరోయిన్. మలయాళంలో మెప్పించిన ఈ చిత్రాన్ని ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తెలుగులో డిసెంబర్ 13న రిలీజ్ చేసింది.ఇపుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇస్తుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాలు చూద్దాం.

Also Read:-‘ఆస్కార్’ బరిలో నిలిచిన ‘కంగువ’.. షార్ట్ లిస్ట్లో ఉన్న మన సినిమాలివే..!

పాని ఓటీటీ:

పాని మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సోనీలివ్ వెల్లడించింది. జనవరి 16 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  తెలుగుభాషలో కూడా అందుబాటులోకి రానుంది.2024 అక్టోబర్ 24న మలయాళ థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర రూ.60 కోట్లు వసూలు చేసి విజయం సాధించింది. జోజూ జార్జ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, తెలుగు భాష‌ల్లో ప‌లు సినిమాలు చేశాడు జోజూ జార్జ్‌.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony LIV (@sonylivindia)

పాని కథ:

త్రిసూర్ లో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ నేపథ్యంలో తెరకెక్కింది. అది ఓ జంట జీవితాలను ఎలా మార్చేస్తుందన్నదే ఈ పని మూవీ స్టోరీ. ఇద్దరు యువకులు - డాన్ సెబాస్టియన్ (సాగర్ సూర్య) మరియు సిజు కెటి (జునైజ్ VP). వారు కేరళలోని త్రిస్సూర్‌లో ఒక వృద్ధుడు నడుపుతున్న మోటార్‌సైకిల్ రిపేర్ షాపులో పని చేస్తుంటారు.ఈ ఇద్దరూ చాలా అమాయకంగా కనిపిస్తారు. కానీ, వీరి వెనుక ఒక చీకటి క్రైమ్ యాంగిల్ ఉంటుంది. కాంట్రాక్ట్ హత్యల ద్వారా త్రిసూర్ నగరంలో ఒక మంచి డాన్ గా పేరు తెచ్చుకోవాలని కలలుగానే రౌడీలు వీరు. ఈ గ్యాంగ్ స్టార్స్ వల్ల భార్యాభర్తలైన గిరి తన భార్య గౌరీల జీవితాల్లో కీలకమైన మలుపు చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. త్రిసూర్ లో ఉన్న రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే వార్ ఓ జంట జీవితాన్ని ఎలా మార్చిందనేది కథ.