రజనీతో కమల్‌‌‌‌ భేటీ

చెన్నై: హీరో రజనీకాంత్‌‌‌‌తో మక్కల్‌‌‌‌ నీది మయ్యం ఫౌండర్‌‌‌‌‌‌‌‌, యాక్టర్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌ హాసన్‌‌‌‌ శనివారం భేటీ అయ్యారు. రాజకీయాల్లోకి రావడంలేదని రజనీకాంత్‌‌‌‌ ప్రకటించిన తరువాత వీరిద్దరూ తొలిసారి మీట్‌‌‌‌ అయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం మక్కల్‌‌‌‌ నీది మయ్యం పార్టీ ప్రచారాన్ని స్టార్ట్‌‌‌‌ చేస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ మీటింగ్‌‌‌‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే, వీరిద్దరి మధ్య రాజకీయాల గురించి చర్చ జరగలేదని సోర్సెస్‌‌‌‌ ద్వారా తెలుస్తోంది. రజనీకాంత్‌‌‌‌ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని చాలాకాలం చర్చ జరిగినా.. రాజకీయాల్లోకి రావడం లేదని ఇటీవలే ఆయన ప్రకటించారు. బీపీ ప్రాబ్లమ్స్‌‌‌‌ కారణంగా హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌ అయ్యి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్న రెండు రోజుల తరువాత ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. ఈ మాట చెప్పడానికి ఎంతగా ఇబ్బందిపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు’’అని రజనీకాంత్‌‌‌‌ చెప్పారు. కాగా, 2018లో పార్టీ ప్రారంభించిన కమల్‌‌‌‌ హాసన్‌‌‌‌.. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్‌‌‌‌ చేశారు. తాను రజనీకాంత్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌ కోరుతున్నానని కమల్‌‌‌‌హాసన్ ఇటీవల ప్రకటించారు.

For More News..

తెలంగాణ టీ20 లీగ్‌ కొనసాగించరా?

తాగిన మత్తులో సూసైడ్ చేసుకున్న కార్మికులు

ఆన్‌లైన్ క్లాసులో న్యూసెన్స్ చేసిన వ్యక్తి