కన్నడు నటుడు కిచ్చా సుదీప్ ఈగ మూవీతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే తన సినీ కెరీర్ కు సరిగ్గా ఇవాళ్టితో 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సుదీప్ తన కుటుంబ సభ్యులకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా సుదీప్ తన భార్య ప్రియను ప్రశంసలతో ముంచెత్తారు. తన భార్య ప్రోత్సాహం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటూ ఆకాశానికెత్తేశారు. తన భార్య చేసిన త్యాగాల వల్లే నటుడిగా ఈ స్థాయికి వచ్చానని సుదీప్ తెలిపారు. ఆమె సపోర్ట్ లేకపోతే తాను ఇంత దూరం ప్రయాణించే వాడిని కాదన్నారు. ఎన్నో సార్లు తనకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా చెప్పలేకపోయానని అన్నారు. అలాగే ఏ విషయంలోనైనా అభిప్రాయాన్ని చెప్పే తన కూతురు శాన్వి, తనకు జీవితాన్నిచ్చిన అమ్మనాన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు.
కిచ్చా సుదీప్ 1997లో తాయవ్వ అనే మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో స్పర్శ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల నటించిన విక్రాంత్ రోణ విజయం సాధించింది.