వినాయకుడు ఫేం హీరో కృష్ణుడు పేకాట ఆడుతూ పట్టుబడ్డాడు. మియాపూర్ లోని శిల్పాపార్క్ L-59 ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈ సోదాల్లో వినాయకుడు సినిమా హీరో కృష్ణుడు, పేకాట నిర్వాహకుడు పెద్దిరాజుతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి లక్షా 97 వేల నగదు, 8 మొబైల్ ఫోన్స్, 10 పేకాట బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. నటుడు కృష్ణుడుకు తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా మంచి పేరుంది. ఆయన హ్యాపీడేస్, ఏం మాయ చేశావే, విలేజ్‌లో వినాయకుడు, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మి తదితర సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో కనుమరుగయ్యాడు.