‘ఇదొక స్ట్రాంగ్ ఎమోషన్ కంటెంట్ ఉన్న ఎంటర్‌‌‌‌టైనింగ్ ఫిల్మ్

‘ఇదొక  స్ట్రాంగ్ ఎమోషన్ కంటెంట్ ఉన్న ఎంటర్‌‌‌‌టైనింగ్ ఫిల్మ్

ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ కంటే ‘మనమే’ చిత్రంలో తన పాత్ర డిఫరెంట్‌‌గా ఉంటుందని చెప్పింది కృతి శెట్టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో  శర్వానంద్‌‌కు జోడీగా ఆమె నటించిన ఈ చిత్రం జూన్ 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతి శెట్టి చెప్పిన విశేషాలు. 

‘‘ఇదొక  స్ట్రాంగ్ ఎమోషన్ కంటెంట్ ఉన్న ఎంటర్‌‌‌‌టైనింగ్ ఫిల్మ్.  ఇందులో వండర్‌‌‌‌ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉంది. అది గ్లోబల్ ఆడియన్స్‌‌కి కనెక్ట్ అవుతుంది. శర్వానంద్, నేను, పిల్లాడు.. మా ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టూ జరిగే కథ ఇది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. ఇందులో నా పాత్ర పేరు సుభద్ర. చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశా. ఇందులో చాలా స్ట్రిక్ట్‌‌ పాత్రలో కనిపిస్తా.  శర్వానంద్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మర్. ఫైనల్ అవుట్‌‌పుట్ చూస్తే..  ప్రతి సీన్‌‌లో  ఆయన ఎక్స్‌‌పీరియెన్స్ కనిపించింది. 

ఈ మూవీ మేజర్ షూటింగ్  లండన్‌‌లో చేశాం. అక్కడి వాతావరణం ఊహించలేకుండా  ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో వర్క్ చేయడం హ్యాపీ. నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల గారు లండన్‌‌లో ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకున్నారు. ఇక తెలుగులో నాకు గ్యాప్ వచ్చిందంటున్నారు. ఈ గ్యాప్ కావాలని తీసుకోలేదు. ఇతర ఇండస్ట్రీస్‌‌లో బిజీగా ఉండటంతో గ్యాప్ వచ్చింది అంతే. 

అలాగే చాలా సెలెక్టివ్‌‌గా సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. అలాగే టోవినో థామస్‌‌తో ఒక మలయాళం ఫిల్మ్ చేస్తున్నా.  నాకు ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ‘బాహుబలి’లో అనుష్క గారి లాంటి క్యారెక్టర్స్. అలాగే యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్ ఉన్న రోల్స్ చేయాలని ఉంది’’.