‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నానని మంచు విష్ణు అన్నారు. సినిమా కుటుంబంలో పుట్టిన తనకు సినిమా పరిశ్రమ, నటులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు తెలుసునని ఆయన అన్నారు. తెలుగు సినీపరిశ్రమ వల్ల తన కుటుంబానికి ఎంతో పేరొచ్చిందని.. అందుకే ఇప్పుడు ఈ విధంగా సినీపరిశ్రమ బుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు.
తన తండ్రి మోహన్‌బాబు గతంలో ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు తనకు మార్గదర్శకాలయ్యాయని విష్ణు అన్నారు. గతంలో ‘మా’కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన తనకు ఎవరికి ఏది అవసరమో స్పష్టమైన అవగాహన ఉందని ఆయన అన్నారు. కష్టాలలో ఉన్న ‘మా’ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటూ.. ‘మా’ అసోసియేషన్‌కు సంపూర్ణంగా సేవ చేయాలనుకుంటున్నానని విష్ణు తెలిపారు. ‘మా’ను యువరక్తంతో ముందుకు తీసుకెళ్లాలనే తన ఆలోచనకు నటీనటులందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలుపుతూ మంచు విష్ణు ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
నా MAA కుటుంబానికి ?.To my MAA family ? pic.twitter.com/1TDa3f8lYA
— Vishnu Manchu (@iVishnuManchu) June 27, 2021