గ్రేట్ యాక్టర్: ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు

గ్రేట్ యాక్టర్: ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (70th National Awards 2024) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్ట్ 16న) ప్రకటించి.. మంగళవారం అక్టోబర్ 8వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలందరికీ తన చేతుల మీదుగా అవార్డులు అందజేసి అభినందించారు. ఈ క్రమంలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) తన కెరీర్లో నాల్గవ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఓటీటీలో రిలీజైన ‘గుల్‌మొహర్‌’ (Gulmohar) మూవీలో మనోజ్ నటనకు గానూ ఆయనకు ఈ అరుదైన గౌరవం లభించింది. మరోసారి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నందుకు మనోజ్ బాజ్‌పేయి వీడియో సందేశంలో కృతజ్ఞతలు తెలిపారు.

మనోజ్ మాట్లాడుతూ, ‘నేను గౌరవంగా భావిస్తున్నాను. క్రెడిట్ అంతా నేనే తీసుకోలేను. ఈ సినిమాని నాకు అందించిన దర్శకుడికి, నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ, నా పనికి సహకరించిన నా సహనటులందరికీ ధన్యవాదాలు. మనోజ్ తనను తాను అదృష్టవంతుడిగా కూడా అభివర్ణించాడు. మనోజ్ బాజ్‌పేయి ఇంకా మాట్లాడుతూ, ‘నన్ను ప్రేమించిన ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. 

Also Read:-కాంతార, కార్తికేయ 2 సినిమాలకు నేషనల్ అవార్డ్స్

అలాగే.. "నాకు మూడుసార్లు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు, ఇపుడు నాల్గవసారి అందుకున్నప్పుడు నాలో అంతే మార్పు ఉంది.  గుల్‌మొహర్‌కు జాతీయ అవార్డు రావడం మరింత ప్రత్యేకం చేసింది. ఎందుకంటే, మొదటిసారిగా నా భార్య జాతీయ చలనచిత్ర అవార్డుకు హాజరైంది. అంతేకాకుండా గుల్‌మొహర్‌ మూవీ మూడు అవార్డులను కైవసం చేసుకుంది. ఇది నేను గౌరవంగా భావిస్తున్నాను. క్రెడిట్ అంతా నేనే తీసుకోలేను. ఈ సినిమాని నాకు అందించిన దర్శకుడు రాహుల్ వి. చిట్టెల్లాకి, నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ, నా పనికి సహకరించిన నా సహనటులందరికీ ధన్యవాదాలు" అని తెలిపారు. ఈ మూవీ బాలీవుడ్ లో ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్స్), ఉత్తమ నటుడు కేటగిరీలో అవార్డులు అందుకుంది. కాగా మనోజ్ బాజ్‌పేయి రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా, రెండుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. దాంతో ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు వరించడంతో..'గ్రేట్ యాక్టర్' అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. 

ఈ సారి జాతీయ అవార్డుల్లో మ‌ల‌యాళం, క‌న్న‌డ, త‌మిళ‌ సినిమాలు ఎక్కువ‌గా అవార్డుల‌ను గెలుచుకున్నాయి. బెస్ట్ ఫిల్మ్‌గా మ‌ల‌యాళం మూవీ ఆట్ట‌మ్ అవార్డును గెలుచుకున్న‌ది. ఉత్తమ నటుడుగా కాంతార మూవీకిగాను రిష‌బ్ శెట్టి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఉత్తమ హీరోయిన్ అవార్డు ఈ సారి ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ద‌క్కింది.

నిత్యామీన‌న్ (తిరుచిత్రాంబ‌ళం), మాన‌సి ప‌రేఖ్ (క‌చ్ ఎక్స్‌ప్రెస్ గుజ‌రాతీ మూవీ) అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. హీరో నిఖిల్ కార్తికేయ‌ 2 సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు వరించింది. ఈ ఒక్కటి మిన‌హా తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రే అవార్డు రాక‌పోవ‌డంతో..తెలుగు సినిమాకు నిరాశే ఎదురైంది.