Mithun Chakraborty: నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Mithun Chakraborty: నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (74) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. 
 
మిథున్ చక్రవర్తి విశేషమైన సినీ ప్రయాణం, భారతీయ సినిమా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

సినిమాటిక్ ఐకాన్

మిథున్ చక్రవర్తి, జూన్ 16, 1950న కలకత్తాలో జన్మించారు. 1976లో మృగయ సినిమాతో సినీ అరంగ్రేటం చేసిన ఆయన 270 నుండి 300 చిత్రాలలో నటించారు. ఆయన నటించిన తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకోవడం గమనార్హం.

ALSO READ : దసరా కానుకగా .. అక్టోబర్ 11న విడుదల అవుతున్న జిగ్రా మూవీ