మంచు ఫ్యామిలీ(Manchu Family) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో అవా క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇండియా వైడ్గా ఉన్న చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. వారిలో.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఉన్నారు.
తాజాగా ‘కన్నప్ప’ చిత్రబృందం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని యూనిట్ డిసైడ్ అయింది. ఇందులోభాగంగా మోహన్‌బాబు, విష్ణుతోపాటు ఇతర చిత్రబృందం తాజాగా కేదార్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"ఒక పురాణ గాధ కోసం.. ఆ శివయ్య ఆశీర్వాదం కోసం! ‘12 జ్యోతిర్లింగాల ప్రయాణాన్ని ప్రారంభించాం. పవిత్రక్షేత్రం కేదార్‌నాథ్‌ను సందర్శించి.. కన్నప్ప సినిమా కోసం ప్రార్థించాం.. హరహర మహాదేవ్’’ అని మంచు విష్ణు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Seeking blessings for an epic tale! @ivishnumanchu and team Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30#Kannappa🏹 #FaithAndCourage #SpiritualJourney pic.twitter.com/zVg8RfcOc0
— Kannappa The Movie (@kannappamovie) October 25, 2024