కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వ్యవహరంపై సీనియర్ యాక్టర్ మోహన్ బాబు స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన మోహన్ బాబు లడ్డూ కల్తీ కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు మూడు నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయా.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.
ALSO READ | ఆ క్షణం నా మనస్సు బద్దలైంది.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్
ఏడు కొండల స్వామి ఆలయంలో ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకమన్న మోహన్ బాబు.. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కోరతున్నానని అన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నెయ్యిలో జంతు నూనె, కొవ్వు ఉపయోగించారన్న చంద్రబాబు కామెంట్స్ నేషనల్ వైడ్గా చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు.