తన మాటతీరుతో కట్టిపడేసే మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీ ప్రసన్నపుట్టినరోజు నేడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురైన లక్ష్మీ ప్రసన్న గురువారం 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఒక పక్క పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ.. మరోపక్క నచ్చిన పాత్రల కోసం సినిమాలలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎన్ని జన్మలైనా లక్ష్మీనే కూతురుగా ఇవ్వాలని ఆయన దేవుడిని ప్రార్థించారు.
‘నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైఢ్యూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టిన రోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురిగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచ భూతాలని ప్రార్ధిస్తున్నాను, హ్యాపీ బర్త్‌డే టూ మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. మంచు లక్ష్మీని చిన్నప్పుడు ఆయన ఎత్తుకున్న ఫొటోను ఈ ట్వీట్‌కు జతచేశారు.
Wishing many happy returns of the day to my priceless treasure @LakshmiManchu. Enni Janmalaina nuvvu naa kuturuga puttalani, aa devudni pradhisthuna. Love you 3000. #HBDLakshmiManchu pic.twitter.com/H1iC4l9Lvx
— Mohan Babu M (@themohanbabu) October 8, 2020
For More News..