వయనాడ్ బాధితులకు సినీనటుడు మోహన్ లాల్ రూ.3కోట్లు సాయం

వయనాడ్ బాధితులకు సినీనటుడు మోహన్ లాల్ రూ.3కోట్లు సాయం

ప్రముఖ సినీనటుడు, ఇండియన్ ఆర్మీ ల్యూటనెంట్ కల్నల్ మోహన్ లాల్ వయనాడ్ లో ఫ్లడ్స్, ల్యాండ్స్ స్లైడ్స్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం ఆగస్టు3, 2024  వయనాడ్ లో పర్యటించిన మోహన్ లాల్..బాధితులను ఆదుకునేందుకు రూ.3 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. వయనాడ్ పరిధిలోని మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న మోహన్ లాల్, అధికారులతో కొద్దిసేపుచర్చించి కొండచరియలు విరిగిన పడిన మండలానికి వెళ్లారు. 

ల్యాండ్ స్లైడ్స్ కు గురైన చూరల్ మలా, ముండక్కై, పుంఛిరి మట్టం ప్రాంతాలను సందర్శించారు. ఆర్మి, స్థానికులు, రెస్క్యూ వర్కర్లతో మాట్లాడి విపత్తు తీవ్రతను తెలుసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ ఎఫ్, ఫైడ్, అండ్ రెస్క్యూ టీంలు , స్వచ్ఛంద సంస్థలు స్థానికులు సహాయక చర్యల్లో భాగమయ్యారు. వారి పని తీరు అద్భుతంగా ఉందన్నారు మోహన్ లాల్.
 
భారత సైన్యంలో ని 122 పదాతి దళ బెటాలియన్ (TA) లో భాగంగా తాను కూడా విపత్తు తో దెబ్బతిన్న ప్రాంతానికి వచ్చిన టీంలో భాగమన్నారు. విశ్వశాంతి ఫౌండేషన్ తరపున వయనాడ్ బాధితులకు పునరావాస పనులకోసం3కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు మోహన్ లాల్. దీంతోపాటు దర్శకుడు మేజర్ రవి తో కలిసి ముండక్కయ్ స్కూల్ లను పునర్నిర్మించనున్నట్లు మోహన్ లాల్ తెలిపారు.