నాంపల్లి కోర్టుకు నాగార్జున: మంత్రి సురేఖపై స్టేట్మెంట్

నాంపల్లి కోర్టుకు నాగార్జున: మంత్రి సురేఖపై స్టేట్మెంట్

సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరైంది. నాగార్జున వెంట ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య కూడా ఉన్నారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన క్రిమినల్ పిటిషన్పై కోర్టు స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు కోర్టు చేయనుండటం గమనార్హం. నాగార్జున తరపున అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే మంత్రి క్షమాపణలు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ తిరుపతి వర్మ గుర్తు చేశారు. నాగార్జునపై లీగల్గా ప్రొసీడ్ అవుతాం అని అడ్వకేట్ చెప్పారు.

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన క్రిమినల్, పరువు నష్టం దావా కేసును నాంపల్లి మనోరంజన్‌‌ కాంప్లెక్స్‌‌‌లోని స్పెషల్‌ కోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం (అక్టోబర్ 7, 2024) విచారణ జరిపింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను నాగార్జున తరఫు అడ్వకేట్ కోర్టుకు వివరించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను అందించారు.

ALSO READ | పెద్దపల్లిలో వందేభారత్ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలి.. రైల్వేజీఎంకు ఎంపీ వంశీకృష్ణ రిక్వెస్ట్..

ఫిర్యాదుదారు నాగార్జున, పిటిషన్‌‌‌‌లో పేర్కొన్న సాక్షులు యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్‌‌వాంగ్మూలాలను రికార్డ్‌ చేయాలని కోరారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. ఈ మేరకు నాగార్జున సహా ముగ్గురి స్టేట్‌మెంట్స్‌‌ను రికార్డ్‌ చేసేందుకు కోర్టు అంగీకరించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై జడ్జి సమక్షంలో తన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండటంతో ఆయన నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.