నాగచైతన్య.. సమంత విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని.. ఎన్ కన్వెన్షన్ వివాదం వెనక.. సమంత విడాకుల ఇష్యూ ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నటుడు అక్కినేని నాగార్జున. ఈ మేరకు తన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది..
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
Also Read :- కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనంగా మారాయి. వైరల్ కావటంతో.. నాగార్జుననే స్వయంగా స్పందించారు.