ఇండియన్ క్రికెట్ హిస్టరీలో 1983 ఎంతో ముఖ్యం. మన దేశం తొలి వరల్డ్ కప్‌ను అందుకున్న సంవత్సరమది. ఆ అద్భుతమైన క్షణాల్ని ‘83’ పేరుతో సినిమాగా మలిచాడు బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్. కపిల్ పాత్రను రణ్‌వీర్ సింగ్, ఆయన భార్య రోమీ పాత్రను దీపిక పోషించారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి నాగార్జున నిర్మించారు. ఈ సినిమా ఇవాళ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ ‘83 వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్‌ని ఎవరూ మర్చిపోలేరు. అదో హిస్టారికల్ మూమెంట్. మ్యాచ్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ నాకింకా గుర్తున్నాయి. ఇండియా అంతా ఒక్కటై సెలెబ్రేట్ చేసుకున్నాం. దాన్ని అందరూ తమ సొంత విక్టరీగా ఫీలయ్యారు. ఆ జర్నీని సినిమాగా మలచడం ఇన్‌స్పైర్ చేసే విషయం. ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి’ అన్నారు.
రణ్‌వీర్ మాట్లాడుతూ ‘నాకిది చాలా స్పెషల్ మూవీ. జీవితంలో మర్చిపోలేని సినిమా. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రలో యాక్ట్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఎంతోమంది టాప్ క్రికెటర్లు వచ్చి ఈ మూవీని, నన్ను బ్లెస్ చేశారు. వారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు’ అని చెప్పాడు. కబీర్ ఖాన్ మాట్లాడుతూ ‘ఇలాంటి ఓ ఐకానిక్ మూవీని తీసి, రిటైరయిపోయి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా. దీని కోసం రెండేళ్లు రీసెర్చ్ చేశాను. ఒరిజినల్ ప్లేయర్స్‌ని కలిసి చాలా ఇన్‌పుట్స్ తీసుకున్నా. ప్రతి ప్రేక్షకుడికీ మంచి సినిమా చూశామనే ఫీల్ కచ్చితంగా కలుగుతుంది’ అని చెప్పాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ ‘సినిమాలో క్రికెట్ ఒక పార్ట్ అంటే ఏ హీరో అయినా చేస్తాడు. కానీ స్ర్కీన్‌పై డ్రామా పండించడం బిగ్గెస్ట్ థింగ్. రణ్‌వీర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం కబీర్ రెండేళ్లకు పైగా కష్టపడ్డాడు. ఇండియన్ టీమ్ మెంబర్‌గా నాకిది ప్రౌడ్ మూమెంట్’ అన్నారు. స్ర్కీన్‌పై రణ్‌వీర్ కనిపించడు, కపిల్ దేవ్ మాత్రమే కనిపిస్తాడని చెప్పారు క్రికెటర్ శ్రీకాంత్. విష్ణు ఇందూరి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో శిభాషీష్ సర్కార్ పాల్గొన్నారు.