Saripodhaa Sanivaaram Twitter Review: నాని, ఎస్ జే సూర్యల మాస్ బొమ్మ‌ ఎలా ఉందంటే?

Saripodhaa Sanivaaram Twitter Review: నాని, ఎస్ జే సూర్యల మాస్ బొమ్మ‌ ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటించింది..దీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మించిన ఈ సినిమా గురువారం ఆగస్ట్ 29న థియేటర్లలలో రిలీజైంది. అంటే సుందరానికి వంటి సినిమా తరువాత  నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో సరిపోదా శనివారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి థియేటర్లోకి వచ్చాక స‌రిపోదా శ‌నివారం టాక్ ఎలా ఉంది? ఆడియన్స్ ను ఎలా మెప్పించిందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. 

నానితో పాటు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్‌ ఎమోష‌న్స్‌, కామెడీ క‌ల‌బోత‌గా సాఫ్ట్‌గా ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మాస్ యాక్ష‌న్ డ్రామాగా స‌రిపోదా శ‌నివారం మూవీ ఉందని నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తోన్నారు. నాని, ఎస్‌జే సూర్య క‌లిసి స్క్రీన్‌పై క‌నిపించే ప్ర‌తి సీస్ ఆడియన్స్ చేత విజిల్స్ పడేలా ఉందంటున్నారు. 

Also Read:-నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు.?..మహిళా కమిషన్ నోటీసులు చెల్లవ్

హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌తో పాటు ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌, క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయ‌ని చెబుతోన్నారు. రేసీ స్క్రీన్‌ప్లే, హై ఇంటెన్స్‌ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో చివ‌రి వ‌ర‌కు సినిమా థ్రిల్లింగ్‌ను పంచుతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

మరొక నెటిజన్ ట్వీట్ చేస్తూ..డైరెక్టర్ వివేక్ స్క్రీన్ ప్లే మరీ అంత గొప్పగా ఏమీ లేదు.. ఎస్ జే సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగుంది.. పోతారు.. మొత్తం పోతారు.. ఇక సెకండాఫ్ వచ్చే సరికి కాస్త బోరింగ్ అనిపించిందట. మాస్‌ను మాత్రం ఎంటర్టైన్ చేస్తుందట..బీజీఎం మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందంటున్నారు.

వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే గొప్పగా ఏమీ లేదు. కానీ ఫస్టాఫ్‌ ఎస్‌జే సూర్య, నానిల యాక్టింగ్‌ అదుర్స్‌. వారి కోసమే సినిమా చూడాలి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయింది. పోతారు.. మొత్తం పోతారు. ఇక సెకండాఫ్‌ మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. బీజీఎం అదిరిపోయిందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

త‌న టిఫిక‌ల్ కంఫ‌ర్ట్‌ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి యూనిక్ స్టోరీలైన్‌తో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ స‌రిపోదా శ‌నివారం మూవీని తెరకెక్కించాడని అంటున్నారు. హీరో విల‌న్ కాన్‌ఫ్లిక్ట్‌, కొన్ని ట్విస్ట్‌లు మాత్రం స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయ‌ని ట్వీట్లు చేస్తున్నారు. హీరో, హీరోయిన్ల ల‌వ్ స్టోరీని డిఫ‌రెంట్‌గా ప్ర‌జెంట్ చేశార‌ని ట్వీట్స్ చేస్తున్నారు. సెకండాఫ్‌ను మాత్రం ద‌ర్శ‌కుడు గ్రిప్పింగ్స్‌గా న‌డిపించాడ‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు.

మూడు గంట‌ల ర‌న్ టైమ్ ఈ సినిమాకు మైన‌స్‌గా మారింద‌ని చెబుతోన్నారు. ఫ‌స్ట్ హాఫ్‌లో నాని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్‌ మొత్తం సాగ‌తీత‌గా ఉంటాయ‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. హీరో పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి డైరెక్ట‌ర్ ఎక్కువ‌గా టైమ్ తీసుకున్నాడ‌ని అంటున్నారు.