![మూడు పెళ్లిళ్లు.. వెయ్యి కోట్లు.. నా ఆస్తి ఇదే](https://static.v6velugu.com/uploads/2023/05/Actor-naresh-sensation-comments-on-his-financial-status_fPRQT1CxIJ.jpg)
సీనియర్ నటుడు నరేష్ తన ఆస్తుల గురించి సంచలన కామెంట్స్ చేశాడు. తన ఆస్తి వెయ్యి కోట్లకంటే ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నటుడు నరేష్, ప్రవిత్ర లోకేష్ జంటగా వస్తున్న తాజా చిత్ర మళ్ళి పెళ్లి. ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. నరేష్- పవిత్ర వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్.. తన ఆస్తి వివరాలను చెప్పుకొచ్చాడు.. "అవును.. నేను బిలియనీర్ ను. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించింది కూడా ఉంది. భూములకు ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం నా ఆస్తుల విలువ రూ. 1000 కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. వివరాలు కావాలన్నా చూపిస్తాను. అందులో చాలా ఆస్తి మా అమ్మగారి దగ్గర నుంచే వచ్చింది. డబ్బు ఎంత ఉన్నా.. నేను నమ్మేది ఒకటే. దేవుడు ఇచ్చింది ఒక జీవితం. మనం హ్యాపీగా ఉండాలి.. మనచుట్టూ ఉన్న పదిమందిని హ్యాపీగా ఉంచాలి. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి” అని చెప్పుకొచ్చాడు నరేష్.
ప్రస్తుతం నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నరేష్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఆయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు నరేష్.