19 వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దు : డ్రగ్స్  కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

  • 19 వరకు నవదీప్ ను ..అరెస్టు చేయొద్దు
  • డ్రగ్స్  కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : డ్రగ్స్‌‌ కేసులో నటుడు నవదీప్‌‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 19 వరకు నవదీప్‌‌ను అరెస్టు చేయరాదని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుడిమల్కాపూర్‌‌  డ్రగ్స్‌‌ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేసిన కేసులో తనను వినియోగ దారుడిగా పేర్కొన్నారని, త్వరలోనే తనను అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నా రని నవదీప్‌‌ శుక్రవారం హైకోర్టులో లంచ్‌‌  మోషన్‌‌  పిటిషన్‌‌  దాఖలు చేశారు.

ALSO READ: ఇండియా కూటమికి.. సీట్ల షేరింగ్ సవాల్..

తనకు ముందస్తు బెయిల్‌‌  మంజూరు చేయాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిష న్ పై జస్టిస్‌‌  కె.సురేందర్‌‌  విచారణ చేపట్టారు. ఈనెల 19 వరకు నవదీప్‌‌ను అరెస్టు చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.